ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వ టీచర్లు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది జీతాలు మార్కెట్ ప్రమాణాల కంటే ఎక్కువగా ఉన్నాయని, వాటిని సమీక్షించి క్రమబద్దీకరించాలని రేవంత్ రెడ్డికి విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి నివేదిక అందజేశారు. వారికి పెరుగుతున్న జీతాలు, అలవెన్సులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారంగా మారాయని, దీంతో విద్యారంగం బలోపేతం చేయడం కష్టంగా మారుతుందని నివేదిక ఇచ్చింది. టీచర్ల జీతాలు తగ్గించడం ద్వారా మిగిలిన నిధులతో స్కూళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించవచ్చని నివేదికలో విద్యా కమిషన్ పేర్కొంది. ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా తీయాలని రేవంత్ రెడ్డికి విద్యా కమిషన్ సిఫార్సు చేసింది.
Admin
E Nivas News