Wednesday, 17 June 2026 01:34:38 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

సైబర్ నేరాలను, అవగాహనతోనే నివారణ సాధ్యం... సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన తప్పనిసరిగా ఉండాలి..

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

Date : 14 February 2026 08:58 PM Views : 160

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు వివిధ నూతన పద్ధతులలో ప్రజలను మోసగిస్తున్న సందర్భాలలో ప్రజలకు అవగాహన, అప్రమత్త తప్పనిసరిగా ఉండాలని శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శనివారం పోలీసు కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీమాట్లాడుతూప్రజలు ఆర్థిక సైబర్ నేరాలకు మోసపోయిన వెంటనే సైబర్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 లేదా జాతీయ సైబర్ క్రైమ్ వెబ్సైట్ ద్వారా ఫిర్యాదులను నమోదు చేయాలని తెలిపారు. ఆర్థిక నేరాలలో గోల్డెన్ హవర్ ముఖ్యమైనదని మోసపోయిన వెంటనే గ్రహించి ఫిర్యాదు చేసిన యెడల, మోసపోయిన డబ్బు ఎక్కువ శాతం తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. సైబర్ నేరగాళ్లు ప్రస్తుత సమాజంలో ఏపీకే ఫైల్స్ ద్వారా మొబైల్ హ్యాకింగ్ పాల్పడుతూ, ఏఐ ఆధారిత వీడియో మెసేజ్ ల ద్వారా మోసం చేస్తున్న తీరు ప్రబలిందని వాటిపట్ల అప్రమత్తతో వ్యవహరించాలని సూచించారు. అదేవిధంగా సైబర్ నెరగాళ్లు ఐపిఓ ద్వారా ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ చేస్తుంటారని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఫీజులు చెల్లించాలంటూ మోసం చేస్తుంటారని తెలిపారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని స్టాక్ మార్కెట్లో థర్డ్ పార్టీ అప్లికేషన్ల ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసి మోసం చేస్తుంటారని. ఆన్లైన్ నందు నకిలీ కస్టమర్ కేర్ నెంబర్లను ఉంచి వాటి ద్వారా మోసం చేసే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. అత్యవసర సమయంలో ఎలాంటి పత్రాలు లేకుండా తక్కువ రుసుముతో ఎక్కువ డబ్బును లోన్ ద్వారా అందిస్తామంటూ నమ్మబలికి మోసం చేసే ప్రయత్నం జరుగుతుందని తెలిపారు. ఈవారం సైబర్ క్రైమ్ నందు 16 ఫిర్యాదులు అందాయని తెలియజేశారు. ఆదిలాబాద్ టు టౌన్ పరిధిలోని ఒకరికి బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ అంటూ లింకు ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చని నమ్మబలికి సైబర్ నెరవేర్లు లక్ష ఇరవై వేల రూపాయలను మోసం చేశారన్నారు. ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్లైన్లో అమ్మాయి పరిచయమై తన ద్వారా 2.7 లక్షల రూపాయలను ఆన్లైన్ నందు ఇన్వెస్ట్ చేయించి, లాభాలు చూయించి, చివరికి డబ్బులను తీసుకుందామంటే రాకపోవడంతో మోస పోయానని గ్రహించిన బాధితుడు ఫిర్యాదు చేశారు. నకిలీ ఏపీకె ఫైల్స్ లింకుల ద్వారా పట్టణానికి చెందిన ఒకరు తన అకౌంట్ వివరాలను నకిలీ లింక్ నందు పొందుపరచడంతో తన అకౌంట్ నుండి 13వేల రూపాయలను సైబర్ నేరగాళ్లు తస్కరించడం జరిగిం దని, ఉట్నూర్ కు చెందిన బాధితుని వద్ద ముద్ర లోన్ వచ్చిందని బాధితుని వద్దనుండి విడతలవారీగా ఫీజులు అంటూ 70 వేల రూపాయలను మోసం చేయడం జరిగిం దన్నారు. ప్రజలు అప్రమత్తతో వ్యవహరించాలని ఎలాంటి సమస్యలున్న జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1930 లేదా సైబర్ క్రైమ్ వెబ్సైట్ నందు ఫిర్యాదులను నమోదు చేయాలని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :