Wednesday, 08 April 2026 05:05:07 PM
# బయ్యారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన సర్పంచ్ లింగయ్య # భక్తాంజనేయ ఆలయ నూతన అధ్యక్షులుగా చెన్నూరి అశోక్ # ఆదిలాబాద్ జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం... # ప్రభుత్వ డిగ్రీ కళాశాల లోఆకట్టుకున్న జిజ్ఞాస ప్రదర్శన... # బోథ్ నియోజకవర్గ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రికి ఎమ్మెల్యే వినతి.. # మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు... # ఆ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపండి... మంత్రి తుమ్మల.. # బాసర ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం.. # ప్రిన్సిపల్ సెక్రటరీకి వినతి ప త్రం అందజేసిన మద్దులప ల్లి గ్రామ సర్పంచి సరిత- # ఎస్టి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయాలి # భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు.. # ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ పీఠం బిజెపి కైవసం... # డ్రైవింగ్ లైసెన్స్‌కు కొత్త రూల్స్....! ఇక మూడు దశల పరీక్ష తప్పని సరిగా రాయాల్సిందే.. # పార్టీ జెండా ఆవిష్కరించిన టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్... # సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు # నిరుపేద కుటుంబంలో జన్మించిన జగజీవన్ రామ్ # సామజిక విప్లవ యోధుడు డా.బాబు జగ్జీవన్ రామ్ # పల్లె పల్లెకు బిజెపి జెండా పండుగను ప్రజల్లోకి తీసు కువెళ్ళాలి # కాటారం డివిజన్‌లో సీనియర్ సిటిజన్స్ డేకేర్ సెంటర్ ఏర్పాటు చేయాలి # ఒక్కో విద్యార్థిపై రూ.1,08,000 ఖర్చు చేస్తున్నాం..! సీఎం

ఏప్రిల్ నెలాఖరు నాటికి అయ్యగారి చెరువు రీ- మోడలింగ్ పనుల్లో 50 శాతం పూర్తి చేయాలి

కలెక్టర్ కోయ శ్రీ హర్ష

Date : 03 April 2026 11:41 PM Views : 50

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి : మంథని ముత్తారం ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి పనులు సమయానికి నాణ్యతతో పూర్తి కావాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ముత్తారం మండలం దర్యాపూర్ ఆదర్శ పాఠశాలలో కోటి రూపాయల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను, మంథని పట్టణంలోని అయ్యగారి చెరువు రీ మోడలింగ్ పనులను కలెక్టర్ పరిశీలించారు. అభివృద్ధి పనులు సమయానికి, నాణ్యతతో పూర్తి కావాలని సంబంధిత అధికారులకు సూచించారు. పనుల పురోగతి పై సమగ్రంగా ఆరా తీసి, ఇప్పటికే ఆమోదించిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అదనపు పనుల కోసం మరిన్ని నిధులు అవసరమైతే వెంటనే అంచనాలు సిద్ధం చేసి సమర్పించాలని, అంచనాలు అందిన వెంటనే అవసరమైన అదనపు నిధులను మంజూరు చేస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం మంథని మున్సిపాలిటీ పరిధిలోని అయ్యగారి చెరువు రీ-మోడలింగ్ పనులను కలెక్టర్ పరిశీలించి చెరువు పునర్నిర్మాణ పనులను వచ్చే సోమవారం నుంచి ప్రారంభించాలన్నారు. ఏప్రిల్ నెలాఖరు నాటికి ప్రతిపాదిత పనుల్లో కనీసం 50 శాతం పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పనులు వేగవంతంగా, నాణ్యతతో కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :