ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ 2వ సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని అసిస్టెంట్ ఎన్నికల అధికారి యన్ మనోహర్ ఆధ్వర్యములో మంథని మున్సిపల్ పరిధిలోని 13 వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు గురువారం మున్సిపల్ కార్యాలయంలో ఎన్నికల నియమావళిపై అవగాహన సమావేశం నిర్వహించారు. అసిస్టెంట్ ఎన్నికల అధికారి & మున్సిపల్ కమిషనర్ యన్. మనోహర్ ఆధ్వర్యములో జి.అంజన్ కుమార్ మాస్టర్ ట్రైనర్, యం.శివ ప్రసాద్ అసిస్టెంట్ ఎక్స్ పెండిచర్ అబ్జర్వర్, ఎన్నికల బ్యాలెట్, ఎన్నికల ఖర్చులు ఇతరత్ర సలహాలు, సూచనలు ఇచ్చారు.
Admin
E Nivas News