Friday, 31 July 2026 07:29:03 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

సరిహద్దులోనూ అక్రమ రవాణాలను పూర్తిగా అరికట్టాలి.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

Date : 23 December 2025 08:50 PM Views : 206

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మహారాష్ట్ర సరిహద్దు నుండి అక్రమ రవాణా జరగకుండా పూర్తిగా అడ్డుకట్ట వేయగలరని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వార్షిక తనిఖీలలో భాగంగా మంగళవారం గాదిగూడ పోలీస్ స్టేషన్ ను పరిశీలించారు. మొదటగా సిబ్బందిచే ఏర్పాటు చేసిన గౌరవ వందనాన్ని స్వీకరించి, పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒక మొక్కను నాటారు. సిబ్బందిచే పరేడ్ నిర్వహించి పరేడ్ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. పోలీసు ప్రతి ఒక్కరూ సక్రమమైన యూనిఫామ్ ధరించాలని, విధులలో నీతి నిజాయితీ, క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. గ్రామాలను సందర్శిస్తూ విపిఓ విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దు గుండా రాయితీ బియ్యం, గుడుంబా, గంజాయి తరలకుండా చర్యలు చేపట్టాలని మండల పరిధిలో మాదకద్రవ్యాల నిర్మూలనకు వాటి వల్ల కలుగు అనార్థాలపై ప్రజలకు సవివరంగా తెలియజేసి చైతన్య పరచాలని తెలిపారు. స్టేషన్ రికార్డులను పరిశీలించి ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఎలాంటి పెండెన్సీ లేకుండా ఉండాలని, సిబ్బంది విధుల పై పర్యవేక్షణ చేయాలని తెలిపారు. గ్రామాలను సందర్శిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా పర్యవేక్షించాలని, ప్రజలకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పించి ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. పోలీస్ స్టేషన్లోని రిసెప్షన్ ను పరిశీలించి బాధితుల సమస్యల పట్ల బాధ్యతయుతంగా వ్యవహరించి పరిష్కారానికి కృషి చేయాలి అన్నారు. స్టేషన్లో పెండింగ్ లో ఉన్న రికార్డులు త్వరితగతిన పూర్తి చేసి ఛార్జ్ షీటు దాఖలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ అదనపు ఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్, పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి ప్రణయ్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :