ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : గృహ అ వసరాలకు అందజేస్తున్న వంట గ్యాస్ (డొమెస్టిక్ ఎ ల్పీజీ) నువాణిజ్యఅవసరాలకువినియోగించినట్లయితే సంబంధిత వారిపై పోలీస్ కేసులునమోదుచేయబడతాయని రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ హె చ్చరించారు.శుక్రవారం తన కార్యాలయచాంబర్‌లో గ్యాస్ వినియోగం మరియు సరఫరా పరిస్థితులపై పౌర సరఫరాలశాఖఅధికారులతో ఆయన సమీక్ష సమావే శం నిర్వహించారు.ఈసంద ర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూగృహవినియోగం కోసం అందించే గ్యాస్ సిలిండర్లను హోటళ్లు,రెస్టా రెంట్లు,టిఫిన్ బండ్లు వంటి వాణిజ్య కార్యకలాపాల్లో ఉపయోగించడం చట్ట విరు ద్ధమని స్పష్టం చేశారు.ఇటు వంటిఅక్రమవినియోగాన్ని అరికట్టేందుకు సంబంధిత అధికారులు క్రమం తప్ప కుండా తనిఖీలు నిర్వహిం చాలని ఆదేశించారు. ప్రత్యేకంగా హోటళ్లు,బయ ట నిర్వహించే టిఫిన్ బండ్లు మరియు ఇతర వాణిజ్య స్థా వరాల్లో గ్యాస్ విని యోగం పై ఆకస్మిక తనిఖీలు చేప ట్టాలని సూచించారు.గృహ గ్యాస్‌నువాణిజ్యఅవసరాలకు ఉపయోగిస్తున్నట్లు తేలి తే సంబంధిత వారిపై చట్టప రమైన చర్యలు తీసుకొని పోలీస్ కేసులు నమోదు చే యాలనిఅధికారులనుఆదేశించారు.పౌర సరఫరాల శాఖ అధికారులు,సిబ్బంది సమన్వయంతో పనిచేసి గ్యాస్ సరఫరా వ్యవస్థ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
Admin
E Nivas News