Friday, 31 July 2026 02:29:48 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య

Date : 01 December 2025 08:35 PM Views : 212

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు సోమవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ లోని రాష్ట్ర సమాచార శాఖ కమీషనరేట్ (సమాచారభవన్) ఎదుట సోమవారంధర్నా నిర్వహించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నాలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలకు చెంది వందలాది మంది జర్నలిస్టులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని జర్నలిస్టులు ముక్తకంఠంతో నిరసించారు.సమస్యలను పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ కన్వీనర్ మామిడి సోమయ్య ధర్నానుద్దేశించి మాట్లాడుతూరాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నా జర్నలిస్టుల సమస్యలు ఏ ఒక్కటీ పరిష్కరించలేదని, కనీసం కొత్త అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితిలో ప్రభుత్వం లేదని అన్నారు. జర్నలిస్టులకు ఇస్తామన్న ఇళ్లస్థలాల ఊసే లేదని, కోర్టు తీర్పు సాకుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని అన్నారు. ఆరోగ్య భీమా పథకాన్ని అటకెక్కించారని, చిన్న మధ్య తరహా పత్రికలను సంక్షోభంలో పడేసారని మామిడి సోమయ్య ధ్వజమెత్తారు. జర్నలిస్టులకు గత ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందంటేఅంతకంటే ఎక్కువగా ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని అన్నారు. జర్నలిస్టుల సమస్యలను త్వరగా పరిష్కరిస్తామంటూ ముఖ్యమంత్రి, సమాచార శాఖ మంత్రి పలు మార్లు హామీలిచ్చారే తప్ప ఆచరణలో పెట్టలేదని, చివరికి జర్నలిస్టుల ప్రతినిధిగా ఉన్న మీడియా అకాడమీ ఛైర్మన్ కూడా కమిటీల పేరుతో కాలయాపన చేసి చివరికి చేతులెత్తేశారని విమర్శించారు. సుప్రీకోర్టు తీర్పును సాకుగా చూపుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వడం లేదని, ఇది చాలా అన్యాయమని, ప్రత్యామ్నాయ జీవో ద్వారా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.జర్నలిస్టుల సమస్యలలో ప్రధానమైన ఇండ్ల స్థలాలు, అక్రెడిటేషన్ కార్డులు,హెల్త్ కార్డులతో పాటు జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ళలో ఉచిత విధ్య, సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్, మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని, చనిపోయిన జర్నలిస్టు కుటుంబానికి ప్రభుత్వం ఇస్తున్న లక్ష రూపాయల సహాయాన్ని రూ.10 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. చిన్న పత్రికలను ఎంపానెల్ లో చేర్చాలని, అడ్వర్టయిజ్మెంట్ పెంటింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని మామిడి సోమయ్య కోరారు. ఈ ధర్నాలో ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ కో-కన్వీనర్లు పులిపలుపుల ఆనందం, వల్లాల జగన్, బండి విజయ్ కుమార్, తన్నీరు శ్రీనివాస్, ఆర్.వెంకటేశ్వర్లు, కుడుతాడి బాపురావు, ఎం.యాదగిరి, కె.పాండురంగారావు, వివిధ జిల్లాల నాయకులు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా నుండి జిల్లా అధ్యక్షుడు వడ్నాల వెంకన్న సూచన మేరకు జిల్లా ప్రధాన కార్యదర్శి వంగరి ప్రవీణ్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాజ్ ఖాన్, మరియు వివిధ జిల్లాల నుండి కంతేటి రమాదేవి, పద్మనాభరావు, ఉదయ్ భాస్కర్ రెడ్డి, గిరిబాబు, అక్బర్ పాషా, పంతాటి రవీందర్, పి.గోపాల్, ఎం.గోపాల్, జక్కుల విజయకుమార్, స్వామిదాస్, మిట్టపల్లి మధు, మిద్దెల సత్యనారాయణ, శ్రీనివాస్ గౌడ్, పర్వతాలు, నీల నరేష్ , మల్లేష్, అశోక్,శంకర్, డప్పు రామస్వామి, శాంతి, సౌభాగ్యవతి, సుష్మ, మంజులారెడ్డి, శివపార్వతి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సమాచార పౌరసంబధాల శాఖ కమీషనర్ కు ఇచ్చే వినతి పత్రాన్ని జాయింట్ డైరెక్టర్ డీ ఎస్ జగన్ కు అందజేశారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించేందుకు కృషి చేస్తానని జగన్ హామీ ఇచ్చారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :