ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఇటీవల చోరీకి గురైన 105 మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్లను బుధవారం ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ బాధితులకు అందజేశారు. ₹12.5 లక్షల విలువైన 105 పోయిన చోరీకి గురైన మొబైల్ ఫోన్లను బాధితులను పిలిపించి వారికి అందజేశారు. మీ మొబైల్ పోయినా వెంటనే సీఈఐఆర్ లో ఫిర్యాదు చేయడంతో పాటు లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలన్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, రిమ్స్, రైతు బజార్, మార్కెట్ వంటి రద్దీ ప్రాంతాల్లోఅప్రమత్తంగా ఉండాలన్నారు. సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు చేసే ముందు సరైన పత్రాలు తప్పనిసరిగా పరిశీలించాలన్నారు.పోయిన మొబైల్‌ను తిరిగి పొందిన బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.కు కృతజ్ఞతలు తెలిపారు.ప్రజల ఆస్తుల రక్షణకు ఆదిలాబాద్ జిల్లా పోలీసులు నిరంతరం కట్టుబడి ఉన్నారని తెలిపారు.
Admin
E Nivas News