Thursday, 30 July 2026 10:02:32 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

బీజేపీ నిర్లక్ష్యంతో ఆర్‌ఎఫ్‌సీఎల్ రామగుండం సంస్థ దెబ్బతింటోంది....

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

Date : 10 March 2026 10:27 PM Views : 133

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పెద్దపల్లి నియోజకవర్గంలోని ఆర్‌ఎఫ్‌సీఎల్ రామగుండం సంస్థను సరైన నిర్వహణ లేకుండానడుపుతున్నారని మంగళవారం పెద్ద పెళ్లి ఎం గడ్డం వంశీకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. సంస్థలో జరుగుతున్న మిస్ మేనేజ్మెంట్, నిర్లక్ష్యంపై కేంద్ర రసాయనాలు మరియు ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా కు పలుమార్లు లేఖలు రాసినట్లు తెలిపారు. వ్యక్తిగతంగా కూడా కలసి సమస్యలను వివరించినప్పటికీ సరైన స్పందన రాలేదని అన్నారు.ప్రస్తుతం ఆర్‌ఎఫ్‌సీఎల్ రామగుండం సంస్థలో ఉత్పత్తి సామర్థ్యం పూర్తిగా వినియోగించుకోవడం లేదని, కేవలం సుమారు 70 శాతం మాత్రమే ప్రొడక్షన్ కొనసాగుతోందని పేర్కొన్నారు. సంస్థ హెడ్ ఆఫీస్ ప్రస్తుతం ఢిల్లీలో ఉండటం వల్ల ఇక్కడి సమస్యలపై తగిన శ్రద్ధ లేకపోతుందని, అందువల్ల హెడ్ ఆఫీస్‌ను హైదరాబాద్‌కు మార్చాలని కూడా పలుమార్లు లేఖలు, విజ్ఞప్తులు చేసినట్లు తెలిపారు.అయితే కేంద్ర ప్రభుత్వం దీనిపై సానుకూలంగా స్పందించలేదని, హెడ్ ఆఫీస్‌ను మార్చే అవకాశం లేదని అధికారికంగా లేఖ ద్వారా తెలియజేసినట్లు చెప్పారు. ఈ నిర్ణయం వల్ల సంస్థ నిర్వహణపై మరింత ప్రభావం పడుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.గతంలో మూతపడిన ఆర్‌ఎఫ్‌సీఎల్ సంస్థను తిరిగి ప్రారంభించేందుకు మాజీ కేంద్ర మంత్రి జి. వెంకటస్వామి, కాకా కలిసి అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ తో చర్చలు జరిపి కృషి చేశారని గుర్తు చేశారు. అనంతరం వివేక్ ఎంపీగా ఉన్న సమయంలో కూడా ఎంతో శ్రమించి సంస్థను మళ్లీ ప్రొడక్షన్‌లోకి తీసుకువచ్చారని తెలిపారు. ఈ సంస్థ ద్వారా అనేక మంది స్థానిక యువతకు ఉపాధి లభించిందని చెప్పారు.రామగుండం ఆర్‌ఎఫ్‌సీఎల్ ద్వారా తెలంగాణకు యూరియా సరఫరా జరగడంతో పాటు, దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా ఎరువులు పంపిణీ అయ్యే విధంగా వ్యవస్థ పనిచేసిందని వివరించారు. అయితే ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వంలో యూరియా నిర్వహణలో గందరగోళం నెలకొన్నదని, సరైన విధంగా ఇంపోర్టులు చేయకపోవడం, ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించకపోవడం వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ పరిస్థితి తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని, దీనిపై నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: