Friday, 31 July 2026 12:53:18 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

సింగరేణి కార్మికుల హక్కునెలకు 10,000 పెన్షన్ వెంటనే అమలు చేయాలి...

పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ

Date : 25 March 2026 08:15 AM Views : 122

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సింగరేణి కార్మికుల సంక్షేమంపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ మంగళవారం ప్రత్యేకంగా స్పందించారు. సంవత్సరాల పాటు గనుల్లో కష్టపడి పనిచేసిన కార్మికులకు రిటైర్మెంట్ అనంతరం గౌరవప్రదమైన జీవితం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేకంగా రిటైర్ అయిన సింగరేణి కార్మికులకు నెలకు కనీసం 10,000 పెన్షన్ అందించాలని గట్టిగా డిమాండ్ చేశారు. “సింగరేణి కార్మికులు తమ జీవితాన్ని గనుల్లో కష్టపడి దేశానికి అంకితం చేశారు. అలాంటి వారికి రిటైర్మెంట్ తర్వాత కనీస భద్రత కూడా లేకపోవడం బాధాకరం. కనీసం 10,000 నెలకు పెన్షన్ ఇవ్వడం వారి హక్కు” అని ఎంపీ పేర్కొన్నారు.ఈ విషయంపై పలుమార్లు ప్రభుత్వానికి ప్రాతినిధ్యాలు ఇచ్చినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. కార్మికుల కష్టాన్ని గుర్తించి వారికి తగిన గౌరవం ఇవ్వాలని ఆయన కోరారు. చివరగా, “సింగరేణి కార్మికుల న్యాయమైన డిమాండ్‌ను వెంటనే అమలు చేయాలి. లేకపోతే వారి హక్కుల కోసం పోరాటం మరింత ఉధృతం అవుతుంది” అని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణహెచ్చరించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :