Thursday, 30 July 2026 12:27:57 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

మహిళల, పిల్లల భద్రతకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది

మొబైల్ వినియోగంలో జాగ్రత్తలు, ఫేక్ కాల్స్, ఆన్‌లైన్ మోసాలపై హెచ్చరిక

Date : 14 February 2026 09:43 AM Views : 184

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మెదక్ పట్టణంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో శుక్రవారం మెదక్ భరోసా సెంటర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాలకి చెందిన సుమారు 200 మంది విద్యార్థులకు చట్టపరమైన హక్కులు, భద్రతా అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భరోసా సెంటర్ భరోసా కోఆర్డినేటర్ సౌమ్య మాట్లాడుతూ పిల్లల హక్కులు, బాలల రక్షణకు అమలులో ఉన్న చట్టాల గురించి వివరించారు. విద్యార్థులపై సోషల్ మీడియా ప్రభావం, మొబైల్ ఫోన్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సమాజంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలను ఉదాహరణలతో తెలియజేశారు. సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని, అపరిచితులతో వ్యక్తిగత సమాచారం, ఫోటోలు లేదా వివరాలు పంచుకోవద్దని సూచించారు. గుడ్ టచ్ – బ్యాడ్ టచ్ గురించి స్పష్టంగా వివరించి, పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, ఇతర నేరాలపై అవగాహన కల్పించారు. పోక్సో చట్టంలోని ముఖ్య నిబంధనలు, నేరస్తులకు విధించే కఠిన శిక్షలను వివరించారు. ఎవరైనా అనుచితంగా ప్రవర్తించినా భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు వెంటనే తెలియజేయాలని సూచించారు. ఎవరు అసభ్యంగా లేదా అనుచితంగా ప్రవర్తించిన వెంటనే డయల్ 100 లేదా షీ టీమ్స్‌కు సమాచారం ఇవ్వాలని, ఫిర్యాదుదారుల వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. విద్యార్థుల మానసిక దృఢత్వం పెంపొందించేందుకు ఫిల్లిస్ క్రిస్టల్ థెరపీ, సర్కిల్ ఆఫ్ లైట్, బీచ్ బాల్, స్టార్ ఫర్ ఫియర్, మేపోల్ వంటి పద్ధతులను కూడా వివరించారు. మహిళలు , పిల్లల భద్రతకు పోలీస్ శాఖ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైతే కౌన్సిలింగ్‌తో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే సైబర్ నేరాలపై ప్రత్యేక అవగాహన కల్పిస్తూ, ఫేక్ కాల్స్, ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా సైబర్ నేరాలకు గురైన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930కు ఫిర్యాదు చేయాలనితెలియజేశారు. విద్యార్థులు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి చదువుపై దృష్టి సారించి, సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని, జిల్లాలో పిల్లల రక్షణ, మహిళల భద్రత మరియు చట్టాలపై అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ శ్రీ, లీగల్ అడ్వైసర్ శ్వేతా, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :