ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని మారుమూల గ్రామమైన దాబాడీ గ్రామాన్ని మంగళవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించారు. గ్రామంలో నీ హనుమాన్ ఆలయంలో పూజలు చేసి గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను గ్రామస్తులు సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న ఇండ్ల సమస్య, డ్రైనేజి సమస్యలను ఎమ్మెల్యేదృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ గ్రామానికి అతిపెద్ద సమస్య రోడ్డు అని తనను సంప్రదించినప్పుడు గ్రామానికి తాత్కాలిక రోడ్డు కొరకు రూ. 10 లక్షలు మంజూరు చేసి రోడ్డు పనులు పూర్తి చేయించడం జరిగిందన్నారు. అదేవిధంగా గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. 10 లక్షలు మంజూరు చేస్తానని హామీ. గ్రామానికి బీటీ రోడ్డు నిర్మాణానికి రూ. 2 కోట్ల 50 లక్షలు మంజూరు చేయించడం జరిగిందన్నారు. వీరితో పాటు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News