Thursday, 30 July 2026 11:44:16 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

పెద్ద హనుమాన్ జయంతికి భారీగా తరలివచ్చిన భక్తులు..

కాషాయమయంగా కొండగట్టు దేవాలయం

Date : 12 May 2026 10:32 PM Views : 98

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జగిత్యాల జిల్లా కొండగట్టులో వెలసిన ప్రజల ఆరాధ్య దైవం కొండగట్టు అంజన్న హనుమాన్ పెద్ద జయంతి వేడకలకు మంగళవారం వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. కొండగట్టు పెద్ద జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి హనుమాన్ భక్తులతో పాటు దీక్షపరుల భారీగా తరలి రావడంతో కొండగట్టు పరిసరాల ప్రాంతాలు కాషాయమయంగా మారాయి. వివిధ రాష్ట్రాల, జిల్లాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి మాలవిరమణ చేశారు. జైశ్రీరామ్ నినాదాలతో ఆలయ పరిసరాలన్నీ జైశ్రీరామ్ నినాదంతో మారు మ్రోగిపోయింది. జయంతి వేడుకల సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారికి తెల్లవారు జాము నుండే ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ప్రభుత్వం తరపున అధికార యంత్రాంగం అంజన్నకు పట్టు వస్త్రాలను సమర్పించారు. అంజన్న నామ స్మరణతో కొండగట్టు పరిసరాలు మారు మోగుతున్నాయి. సోమవారం రాత్రి కొండగట్టు దేవాల యానికి చేరుకున్న కొందరు దూర ప్రాంతాల దీక్షపరులు అంజన్నకు ముడుపు లు ముట్టజెప్పి కళ్యా ణకట్ట భవనంలో మాలవిరమణ చేసి వెళ్తున్నారు. భారీగా తరలివస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుం డా జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. తాగునీరు, చలువ పందిళ్లు, ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయడంతో పాటు, ట్రాఫిక్ నియంత్రణకు భారీగా పోలీసులను మోహరించారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జగిత్యాల జిల్లా ఏసిపి భారీ భద్రత ఏర్పాటు చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :