ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కళ్యాణ లక్ష్మి చెక్కులను ఆర్టిఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ లబ్ధిదారులకు బుధవారం అందజేశారు. రైతు వేదికలో ఘనంగా జరిగిన కార్యక్రమంలో మండల మరియు మున్సిపాలిటీ పరిధిలోని కల్యాణలక్ష్మి పథకానికి చెందిన 427 మంది లబ్దిదారులకు 4 కోట్లు 27 లక్షలు 99 వేల 590 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వం అని తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం సుఖశాంతులతో జీవించేలా ప్రభుత్వం కృషి చేస్తోందని, కల్యాణలక్ష్మి పథకం అప్రతిహతంగా కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెర్వో దిలీప్ కుమార్ మార్కెట్ కమిటీ చేర్మెన్ ప్రేమ్ చెంద్, వైస్ చేర్మెన్ ఎండి ఆరిఫ్, మండల అధ్యక్షులు పింగళి రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమేల రాజు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రవి, కంది మోహన్, వెంకటస్వామి గౌడ్ ఉత్తూరి రవీందేర్, అమీర్, బుద్దెదేవా,రాజమౌళి ప్రజా ప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు, మహిళా సంఘ నాయకులు పాల్గొన్నారు.
Admin
E Nivas News