Friday, 31 July 2026 02:52:35 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

అంగన్వాడీ టీచర్ ను చెట్టుకు కట్టేసి చితకబాదిన గ్రామస్తులు...

Date : 10 April 2026 12:39 AM Views : 284

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సంగారెడ్డిజిల్లాలో ఏ తప్పు చేయని మహిళపై గ్రామస్థులంతా విచక్షణా రహితంగా దాడి చేశారు. ఆమె భర్త చేసిన తప్పుకు మహిళను తీవ్రంగా హింసించారు. ఆ మహిళ భర్త ఫైనాన్స్ డబ్బులు ఇవ్వలేదని ఆమెను చిత్ర హింసలకు గురిచేశారు. చివరికి తీవ్రంగా గాయపడిన ఆ మహిళ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతు న్నారు.సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం దామరగిద్ద గ్రామానికి చెందిన వసంత కుమారి, రాసోల్ గ్రామంలో అంగన్వాడీ టీచర్‌‌గా పనిచేస్తోంది. అయితే వసంత కుమారి, భర్త ప్రభాకర్ హెచ్‌బీఎం ఫైనాన్స్ పేరుతో గ్రామస్తుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేశాడు. రాసోల్ గ్రామానికి చెందిన చాకలి బాలమణి, అవుటి సాయ వ్వ, అవుటి బండ్యప్ప, భూతాలే వైద్యనాథ్, కోటగిరి రాములు అనే వ్యక్తుల వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఆరోపించారు. దీంతో భర్త మీద కోపంతో తమ గ్రామంలో అంగన్వాడీ విధులకు వచ్చిన వసంతకుమారిని జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి గ్రామస్తులు చెట్టుకు కట్టేసి కొట్టారు. అంతేకాకుండా జుట్టు కత్తిరించి గాడిదపై ఊరంతా ఉరేగిస్తామని తీవ్ర బెదిరింపులకు దిగారు. తాను ఏ తప్పు చేయలేదని.. తనను కొట్టొద్దని వసంత కుమారి ఎంత వేడుకున్నా కనీసం కనికరించని గ్రామస్తులు ఆమెపై ఇష్టం వచ్చినట్లు దాడి చేశారు. చెట్టుకు కట్టేసి ఆమెను గంటకు పైగా తీవ్ర చిత్ర హింసలకు గురిచేశారు. వసంత కుమారి,భర్త గ్రామంలోని పలువురు వద్ద నుంచి ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేదని వారు ఆరోపించారు. ఇక ఆమె భర్తపై ఉన్న కోపంతో దీనితో ఎలాంటి సంబంధం లేని వసంత కుమారిపై గ్రామస్తులు విచక్షణారహి తంగా దాడికి పాల్పడ్డారు. చివరికి గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని మాట్లాడటంతో వసంత కుమారిని విడిపించారు. ఈ ఘటనపై బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన కాస్తా మీడియా, సోషల్ మీడియాలో వైరల్ కావ డంతో నెటిజన్లు తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. చేయని తప్పుకు ఆ మహిళను చిత్రహింసలకు గురి చేసిన వారిని తీవ్రంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆమె భర్త తప్పు చేస్తే అతడికి శిక్ష విధించాలి గానీ మహిళను ఎందుకు కొట్టారని ప్రశ్నిస్తు న్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: