Saturday, 13 June 2026 04:22:41 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

కన్నుల పండువగా అయ్యప్ప స్వామి శోభయాత్ర...

Date : 27 December 2025 12:39 PM Views : 217

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : శ్రీ అయ్యప్ప స్వామి శోభయాత్రను దీక్షాపరులు, భక్తులు మంథని పట్టణంలో బుధవారం కన్నుల పండువగా నిర్వహించారు. స్వామి దింతన తోం.. తోం.. అయ్యప్ప దింతన తోం.. తోం.. స్వామియే అయ్యప్ప.. శరణమప్ప అయ్యప్ప.. అంటూ దీక్షా పరులు అయ్యప్ప స్వామి శోభ యాత్రను మంథని పుర వీధుల గుండా వైభవంగా నిర్వహించారు. స్థానిక అయ్యప్ప ఆలయంలో స్వామి వారికి ఉదయం అరట్టు మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మంథని గోదావరి నది తీరంలో ఉదయం స్వామి ఉత్సవ విగ్రహానికి దీక్ష పరులంతా చక్ర స్నానాన్ని కన్నుల పండువగా జరిపించారు. ఆనంతరం ట్రాక్టర్‌పై ప్రత్యేకంగా ఆలంకరించిన మండపంలో వివిధ రకాల పూలతో స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి ఎరుకలగూడెం, బస్టాండ్‌, అంబేద్కర్‌క్‌,గాంధీక్‌, పెంజేరుకట్టల మీదుగా ఆలయం వరకు స్వామి శోభయాత్రను దీక్షా పరులు, భక్తులు ఎంతో వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి పాటలకు దీక్షా పరులు ఆనందోత్సవాల మధ్య భజనలు చేస్తూ స్వామిని స్మరిస్తూ పాటలు పాడారు. శోభయాత్రలో వెళ్తున్న స్వామి వారిని భక్తులు దర్శించుకోవడంతో పాటు కానుకలు, హారతులిస్తూ, కొబ్బరి కాయలు కొడుతూ, స్వామి వారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. శోభయమానంగా జరిగిన స్వామి వారి ఊరేగింపులో పూజారులు నాగేంద్రశర్మ, భద్రయ్య, దీక్షా పరులు వొడ్నాల శ్రీనివాస్, ఎంఎస్.రెడ్డి, కంది కృష్ణారెడ్డి, మిట్ట చంద్రయ్యలతో పాటు పలువురు దీక్షా పరులు, ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :