ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని కార్యాలయాలు, సంస్థలు, ప్రభుత్వం మరియు ప్రైవేటు రంగాలకు చెందిన సంస్థలలో లైంగిక వేధింపుల నిరోధక చట్టం-2013 ప్రకారం తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదుకమిటిఏర్పాట్లు చేయాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత లెనినా సూచించారు. She box portal web site :http://shebox.wcd.gov.in ICC ఏర్పాటు చేయని లేదా ICC వివరాలు పోర్టల్ లో నమోదు చేయని సంస్థల పై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. కావున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు,ప్రైవేటు సంస్థలు, వ్యాపార సంస్థలు, పరిశ్రమలు వెంటనే అంతర్గత ఫిర్యాదు కమిటినీ ఏర్పాట్లు చేసి పూర్తి వివరాలు షీ బాక్స్ పోర్టల్ లొనమోదు చేయాలని కోరారు. అంతర్గత ఫిర్యాదు కమిటీ సభ్యుల వివరాలు జిల్లాసంక్షేమాధికారి కార్యాలయం లో అందించాలని తెలిపారు. ఈ విషయాన్ని గమనించి తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మరియు విద్యా సంస్థల యాజమాన్యాలకు తెలియజేశారు. కమిటీ సభ్యులు ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలన్నారు.
Admin
E Nivas News