Friday, 31 July 2026 11:50:27 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో ప్రవేశం కొరకు దరఖాస్తుల స్వీకరణ...

కలెక్టర్ కుమార్ దీపక్

Date : 14 May 2026 11:20 PM Views : 99

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : 2026-27 విద్యా సంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ పాఠశాలల పథకం క్రింద 1, 5 తరగతులలో ప్రవేశం కొరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని మంచిర్యాలజిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ గురువారంఒక ప్రకటనలో తెలిపారు. నాన్ రెసిడెన్షియల్ లో 1వ తరగతికి 91 సీట్లు, రెసిడెన్షియల్ లో 5వ తరగతికి 92 సీట్లు కేటాయించడం జరిగిందని, షెడ్యూల్డ్ కులాలకు చెందిన అభ్యర్థులు ఈ నెల 16వ తేదీ నుండి జూన్ 6వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా తమ దరఖాస్తులను జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని రూమ్ నం.3 లోని జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ కార్యాలయంలో అందించాలని, దరఖాస్తు ఫారములు కార్యాలయ పని వేళలను పొందవచ్చని తెలిపారు. కుటుంబంలో ఒక అభ్యర్థికి మాత్రమే పథకం వర్తిస్తుందని, అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి 1 లక్ష 50 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల వారికి 2 లక్షల రూపాయల లోపు ఉండాలని తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తుతో పాటు జనన ధ్రువీకరణ పత్రం (మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపల్ బోర్డ్, మీ సేవ ద్వారా జారీ చేయబడినది), 1వ తరగతి విద్యార్థులు జూన్ 1,  2020 నుండి మే 31, 2021 మధ్య, 5వ తరగతి విద్యార్థులు 4వ తరగతి బోనఫైడ్, రేషన్ కార్డు,ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను సమర్పించాలని, మీ సేవ ద్వారా జారీ చేయబడిన కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, 3 పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోలు, పాఠశాల నుండి గత సంవత్సరం మార్కుల జాబితా నకలు ప్రతులు (5వ తరగతి వారికి), అన్ని నకలు ప్రతులపై గెజిటెడ్ అధికారి చే ధ్రువీకరణ సంతకం చేయించి సకాలంలో సమర్పించాలని తెలిపారు. జిల్లాలోని షెడ్యూల్డ్ కులముల అభ్యర్థులు ఈ అవకాశాన్నిసద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :