ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ సహజమేనని సిఐ రమణమూర్తి తెలిపారు. పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న ఎస్సై 2 రామయ్య తో పాటు ఏఎస్ఐ సుధాకర్ లను లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి ఎస్సై గోపతి సురేష్ సిబ్బందితో కలిసి శనివారం ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ సహజమని కానీ మనం చేసే పనితో విధులు నిర్వహించినచోట గుర్తింపు లభిస్తుందన్నారు. ఇంతకాలం సుమారు రెండు సంవత్సరాలకు పైగా ఎస్సై2 గా విధులు నిర్వహించిన రామయ్య అదేవిధంగా ఏఎస్ఐ గా 10 నెలల పాటు విధులు చేపట్టిన సుధాకర్ చేసిన సేవలు మరువలేని అన్నారు. విధుల్లో భాగంగా ఏ పని చెప్పినా కాదు అనకుండా క్రమశిక్షణతో అంకితభావంతో సిబ్బందితో మమేకమై వాళ్ళకు అప్పగించిన విధులను చేపట్టారని అందరూ వీరిద్దరిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. అనంతరం ఇద్దరు ఉద్యోగులను శాలువా పూల మాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దండేపల్లి ఎస్సై తహసియుద్దీన్, జన్నారం ఎస్సై అనూష, ఏఎస్ఐ అన్వర్, హెడ్ కానిస్టేబుల్ కొట్టే తిరుపతి, మురళి, లింగారెడ్డి, రాజేందర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Admin
E Nivas News