Friday, 31 July 2026 09:35:47 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

వరి కొనుగోలు కేంద్రాలలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం...

అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య

Date : 09 May 2026 12:23 AM Views : 174

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలో వరి కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా నిర్వహిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య తెలిపారు . శుక్రవారం మంచిర్యాలజిల్లాలోని హాజీపూర్, లక్సెట్టిపేట మండలాలలోని పలు వరి కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. హాజీపూర్ మండలంలో రహదారిపై రైతులు నిర్వహిస్తున్న రాస్తారోకో వద్దకు చేరుకుని, రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారంపై హామీ ఇచ్చి ఆందోళనను విరమింపజేశారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వెంటనే ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేలా చర్యలు తీసుకున్నారు. రైతుల విజ్ఞప్తి మేరకు హాజీపూర్ మండలంలోని పడ్తన్పల్లి వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి టార్పాలిన్ల కొరతపై రైతులు చేసిన ఫిర్యాదులను మార్కెటింగ్ అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని, మిల్లర్లతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. అనంతరం కర్ణమామిడి వరి కొనుగోలు కేంద్రాన్ని మండల పంచాయతీ అధికారి, సర్పంచ్, ఇతర అధికారులతో కలిసి సందర్శించి కేంద్రంలో కొనుగోలు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పూర్తిగా పాటించాలని కొనుగోలు కేంద్ర నిర్వాహకులను ఆదేశించారు.అవసరానికి అనుగుణంగా లారీలను సమకూర్చాలని రవాణా కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఐకేపీ, పీఏసీఎస్ కేంద్రాల హమాలీలను సమానంగా కేటాయించి, వరి కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని సూచించారు. హాజీపూర్ మండల కేంద్రంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, లారీల కేటాయింపులో రవాణా కాంట్రాక్టర్‌తో మాట్లాడి వెంటనే 5 లారీలను అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని మిట్టపల్లి వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, వరి సంచుల లోడింగ్ పనులపై నిర్వాహకులతో సమీక్షించి కొనుగోలు, లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. వెంకట్రావుపేట వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, నిల్వ సమస్యపై జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. అందుబాటులో ఉన్న సుమారు 1 వేయి మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల పీఏసీఎస్ గోదాంను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండలం తహసీల్దార్ దిలీప్ కుమార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల పంచాయతీ అధికారి శ్రీనివాస్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: