ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని 8వ వార్డు లో వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రభుత్వ విప్, డోర్నకల్ శాసనసభ్యులు జాటోత్ రామచంద్రునాయక్ పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ చీరలు, రెండు లక్షల రుణమాఫీ, సన్న బియ్యం, రైతు భరోసా, డ్వాక్రా మహిళలకు 2 లక్షలు వడ్డీ లేని రుణాలు, ఇందిరమ్మ ఇండ్లు, ప్రభుత్వం చేపట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా స్థానిక నాయకులు కృషి చేయాలని అన్నారు.ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కరించే నాయకత్వం వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డికి ఉందని పేర్కొన్నారు. ఆమె విజయం సాధించేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించగలరని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ నాయకులు,పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వంటికొమ్ము యుగంధర్ రెడ్డి, అభినవ్ రెడ్డి, గంధసిరి అంబరీష,రాంలాల్, పట్టణ అధ్యక్షులు తాజుద్దీన్, అలువాల ఉపేందర్ ప్రజాపతి, గంధసిరి బిక్షపతి, మచ్చ నర్సయ్య, కారంపొడి ఉపేందర్,పోన్నం విజయ్, వెంకన్న, నాన్య, మహేష్, కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News