ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కోకాపేట్ క్రషర్లపై టిఆర్ఎస్ నేతలు ఆరోపణలు అవాస్తవమని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆరోపించారు. నియోపోలిస్ ప్రాంతంలోని క్రషర్లను బుధవారం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ మరియు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న అక్రమ క్రషర్ల ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు తగవని, నిజ నిర్ధారణ కమిటీకి కనీస వాస్తవాలు తెలియకుండానే మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా కోకాపేట్ భాగ్యలక్ష్మి క్రషర్ యూనిట్‌కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన అన్ని రకాల అనుమతి పత్రాలను ఆయన స్వయంగా మీడియాకు చూపించారు. అన్ని అనుమతులు ఉన్న క్రషర్లను అక్రమమని ప్రచారం చేయడం కేవలం బ్లాక్‌మెయిల్ రాజకీయాల్లోభాగమేనని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా బీఆర్‌ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన వెంట ఉన్నారు.
Admin
E Nivas News