ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కేంద్ర మంత్రి బండి సంజయ్, కుమారుడు బండి భగీరథ్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని, బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి రవిశంకర్ డిమాండ్ చేశారు. చట్టాలు సామాన్యులకే వర్తిస్తాయా ప్రజాప్రతినిధులకు వర్తించవా అన్నారు.17 ఏళ్ల మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదు కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచ లనంగా మారిందనిఈ అంశంపై కాంగ్రెస్ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని కరీంనగర్ జిల్లా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో స్థానిక బీఆర్ఎస్ నాయకు లతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూమైనర్ బాలిక ఫిర్యాదు వంటి అత్యంత సున్నితమైన అంశంలో ప్రభుత్వం, పోలీసులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించి బాధితురాలికి తక్షణ న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.కేసు నమోదై ఉన్నప్ప టికీ బండి భగీరథ్ ఇప్పటికీ ఎక్కడ ఉన్నాడు, ఎందుకు అరెస్టు చేయడం లేదు, చట్టం సామాన్యులకేనాఅని ప్రశ్నించారు. సామాన్యులకు ఒకలాగా, అధికార పార్టీలకు మరోలా అమలవుతుందని సుంకె రవిశంకర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి అమ్మనవుతా,అంటూ గతంలో ప్రగల్భాలు పలికిన కల్వకుంట్ల కవిత ఇప్పుడు ఎందు కు మౌనం వహిస్తున్నా రని విమర్శించారు. బాధిత బాలికకు అన్యాయం చేయాలని మధ్యవర్తిత్వం వహిం చిన సంగప్పపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల భద్రత, బాలికల రక్షణ గురించి గొప్పలు చెప్పుకుంటూ ఇలాం టి కీలక వ్యవహారాల్లో ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. బీజేపీ “బేటీ బచావో” నినాదం నిజమైతే బండి సంజయ్ కుమార్ ను వెంటనే కేంద్ర మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డి మాండ్ చేశారు. బాధితురాలు మైనర్ కావడంతో ఈ కేసును అత్యంత ప్రాధాన్యతతో తీసుకొని, రాజకీయ ఒత్తిళ్లు లేదా హోదాలు పక్కనపెట్టి వెంటనే బండి భగీరథ్‌ను అరె స్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
Admin
E Nivas News