ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం మహదేవ్ పూర్ మండలం కాలేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ దంపతులు హాజరై పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించి శుబానంద దేవి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు కలెక్టర్ దంపతులను ఆశీర్వదించి శాలువాతో ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కల్యాణ వేదికపై శివపార్వతుల కళ్యాణ మహోత్సవాన్ని జిల్లా కలెక్టర్ దంపతులు, కలెక్టర్ తల్లి దండ్రులు భక్తులు తిలకించారు. ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ సంతోషం, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మరియు శివపార్వతుల దివ్య ఆశీస్సులు జిల్లా ప్రజలందరికీ కలగాలని ఆకాంక్షించారు. జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరం చేపట్టాలని, భక్తుల అధిక రద్దీని దృష్టిలో ఉంచుకొని సురక్షిత త్రాగునీటి సౌకర్యం సమృద్ధిగా కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అందరు అధికారులు సమన్వయంతో పనిచేస్తూ భక్తులందరికీ అన్నిరకాల సౌకర్యాలు కల్పించామని తెలిపారు. అనంతరం త్రివేణి సంగమంలో ఏర్పాటు చేసిన తెప్పోత్సవం, గోదావరి హారతి కార్యక్రమాన్ని కుటుంబ సమేతంగా తిలకించారు. హంస వాహనంపై పార్వతి పరమే శ్వరుల విగ్రహాలు ఊరేగింపు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
Admin
E Nivas News