ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : లక్షట్టిపేట మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సిపిఎం లక్ష్యమని రాష్ట్ర కమిటీ సభ్యుడు పైళ్ళ ఆశయ్య తెలిపారు.సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం 9వ వార్డు సిపిఎం అభ్యర్థి దుంపల రంజిత్ కుమార్ (సుత్తి కొడవలి నక్షత్రం)గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పైళ్ల ఆశయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కోరారు.9వవార్డులో నెలకొన్న సమస్యల పరిష్కారం కొరకు , వార్డు అభివృద్ధి కొరకు సిపిఎం ప్రజల పక్షాన ఉండిపోరాడుతుందన్నారు. గత 15 ఏళ్లుగా విద్యార్థి, కార్మిక, ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్న దుంపల రంజిత్ కుమార్ కు 9వ వార్డు ప్రజలందరూ ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అశోక్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, కె. బుచ్చయ్య, అంబటి లక్ష్మణ్ , లక్ష్మి, అఖిల్, అనిత తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News