ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండల కేంద్రంలో "హాలో ఆదివాసి ఛలో ఉట్నూర్" పేరుతో ఆదివాసి ధర్మ యుద్ధం పోస్టర్లను సోమవారం ఆదివాసీ నాయకు లు విడుదల చేశారు. ఉట్నూర్ మండల కేంద్రంలోనీ ఎంపీడీవో గ్రౌండ్ లో ఉదయం11 :00 గంటలకు జరగనున్న ఈ భారీ బహిరంగసభ ఆదివాసి సంఘలా సమన్వయ కమిటీ అధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల నాయకుల అధ్వర్యంలో ఈ భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. ఎస్టీ జాబితా నుంచీ లంబాడా లను తొలగించడమే ప్రధాన ఎజెండా గా జరగనున్న ఈ సభకు ఆన్ని సంఘాల నాయకులు గ్రామాల పటేల్ దేవారిలు గ్రామాల పెద్దలు, యువకులు మహిళలు అందరు భారీ ఎత్తున పాల్గొని ఈ భారీ బహిరంగసభను విజయావంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోవ విజయ్ కుమార్, తుడుందేబ్బ జిల్లా అధ్యక్షులు కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు పంధ్రం యశ్వంత్ రావు, కేరమెరి పేసా కొఆర్డినేటర్ ఆడ ఆనంద్ రావు, ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకుడు కనక ప్రభాకర్, కొలం సంఘం మండల నాయకుడు కుంరం మారుతి, విద్యార్థీ సంఘం మండల అధ్యక్షులు సెడ్మకి తుకారాం, మరియు రాయ్ సెంటర్ తుడుందేబ్బ, అదివాసి సంక్షేమ పరిషత్ , విద్యార్థీ సంఘం యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News