ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈనెల 25న 40 ఏళ్లుగా కాంగ్రెస్తో ఉన్న బంధానికి బైబిల్ చెప్పేందుకు సిద్ధమయ్యారు. తను ఇంత కాలంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న సీఎం కానీ అధిష్టానం కాని పట్టించుకోకపోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే కాంగ్రెస్ పెద్దల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీమంత్రి కాంగ్రెస్ ను వీడేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ లో కలకలం సృష్టిస్తున్న జీవన్ రెడ్డి బారీ ప్రణాళికతో భవిష్యత్ కార్యాచరణ రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి రాజకీయం హాట్ టాఫిక్ గా మారింది. పొలిటికల్ సర్కిల్ లో రాజకీయ దుమారం రేపుతుంది. నాలుగు దశాబ్దాల పాటు చెయ్యెత్తి జై కొట్టిన జీవన్ రెడ్డి పార్టీ మారడం అంటే అంత సులభంగా అయ్యే పనికాదన్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా కాంగ్రెస్ పెద్దలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి ఉగాది తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తానని చెప్పడంతో అందరు ఆ సమయం కోసం వేచిచూస్తున్నారు. ఉగాది పండుగ అయిపోవడంతో ఇక ముహూర్తం ఎప్పుడని ఎదురుచూస్తున్నారు. జీవన్ రెడ్డిని బుజ్జగించి కాంగ్రెస్ లోనే కొనసాగించేలా ఆ పార్టీ పెద్దలు ఇప్పటికే రంగంలోకి దిగి మంతనాలు జరిపారు. అందుకు ససేమిరా అంటున్న జీవన్ రెడ్డి, పంతం నెగ్గించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఈ నెల 25న కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి ఎప్రిల్ మొదటి వారంలో పార్టీ మారేందుకు సన్నహాలు చేస్తున్నట్లు సమాచారం. పార్టీ మారేందుకు సిద్దమైన జీవన్ రెడ్డితో అటు బిజేపి, ఇటు బిఆర్ఎస్ రెండు పార్టీల నేతలు టచ్ లోకి వచ్చారట. పెద్దాయన తమ పార్టీలోకి రావాలని ఆ రెండు పార్టీల నేతలు అహ్వానం పలుకుతున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతలు సైతం జీవన్ రెడ్డిని బుజ్జగించి కాంగ్రెస్ లోనే కొనసాగించేలా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. జీవన్ రెడ్డి మాత్రం పార్టీలో తనకు తగ్గిన ప్రాధాన్యత, ఇటీవల కాలంలో చోటుచేసుకున్న పరిణామాలపై ఆవేధన వ్యక్తం చేస్తు పెద్దల తీరును తప్పు పడుతున్నారు. కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు శాసనమండలిలో విపక్షనేతగా పార్టీ వాణిని వినిపించిన ఏకైన నేతగా ఉన్న తనకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నిస్తున్నారు. పైగా తనకు కాస్తైన సమాచారం ఇవ్వకుండా తన రాజకీయ ప్రత్యర్థితో, పార్టీ అంతర్గత వ్యవహారాల్లో అతనికే ప్రాధాన్యత ఇవ్వడంపై ఆంతర్యం ఏంటని నిలధీస్తున్నారు. స్వంతింటి వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వకుండా పక్కింటోనికి గుర్తింపు ఇవ్వడంతో కాంగ్రెస్ లో కొనసాగాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అందుకే పార్టీ వీడేందుకు సిద్దమైనట్లు ఆయన అనుచరులు తెలిపారు.
Admin
E Nivas News