ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని పెద్ద మసీదులో మంగళవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు లో రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తోపాటు మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ హాజరయ్యారు. పవిత్ర రమజాన్ మాసం సందర్భంగా నిర్వహించిన ఈ ఇఫ్తార్ విందులో మంత్రి ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు చేసి వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్ని మతాలు, వర్గాల మధ్య సోదరభావం మరియు ఐక్యత కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ముస్లిం పెద్దలు, యువకులు మరియు ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
E Nivas News