Friday, 19 June 2026 01:50:11 PM
# 26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం... # చికిత్స పొందుతూ యువకుడు మృతి # ఎల్.పి.జి.వినియోగదారులు బ్యాంకు ఖాతాలను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలి... # రుద్రంగి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గల్ఫ్ కార్మికుడు మృతి... # కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన సిర్పూర్ ఎమ్మెల్యే.. # నకిలీ, నాణ్యతలేని విత్తనాలపై ఉక్కుపాదం...! 220 దుకాణాల తనిఖీ.. 18 మందిపై 7 కేసులు 10.20 లక్షల విలువైన 1,181 పత్తి విత్తన ప్యాకెట్లు స్వాధీనం.. # పాఠశాల అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి.. # సేవా కార్యక్రమాలకు గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న మడే రాజేష్ # జన్యుపరమైన అనారోగ్యంతో పోరాడుతున్న హనుమకొండకు చెందిన నిరంజన్..!అభిమాని నిరంజన్ ను పరామర్శించినపవన్ కళ్యాణ్... # ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు..

అంధ పాఠశాల విద్యార్థులకు విజ్ డమ్ హై స్కూల్

విద్యార్థుల 1లక్ష 13 వేల రూపాయల విరాళం..

Date : 23 February 2026 06:39 PM Views : 135

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : హైదరాబాదులోని సోచ్ ఫౌండేషన్ వారి ఇట్రాడో అంధుల పాఠశాలకు వరంగల్ జిల్లా నర్సంపేట విజ్ డమ్ హై స్కూల్ విద్యార్థులు 1లక్ష 13 వేలవిరాళాన్ని అందజేసినట్లు పాఠశాల డైరెక్టర్ జావేద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సోచ్ ఫౌండేషన్ ప్రతినిధి మాట్లాడుతూ తాము గుడ్డి వారిని ఆదరిస్తూ తమ పాఠశాలలో వారికి బ్రెయిలీలిపి తో పాటు, క్రీడలు, సంగీతం, నాట్య కళల్లో శిక్షణను అందిస్తున్నట్లు తెలిపారు. ఈ విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణించడం గర్హనీయం. సమాజంలో పుట్టు గుడ్డి వారు నిరాదరణకు గురవడం మనకు తెలిసిందే. కానీ వారిని మేము అక్కున చేర్చుకుని వారిలోని నైపుణ్యతను గుర్తించి వారికి తర్ఫీదును ఇస్తున్నట్లు ఫౌండేషన్ ప్రతినిధి తెలిపారు. ప్రస్తుతం దేవుడిచ్చిన అందమైన కళ్ళు గలవారు ముఖ్యంగా విద్యార్థులు చూపును కోల్పోవడం బాధ కలిగిస్తుందని వారు ఆవేదనను వెలుబుచ్చారు. దీనికి కారణం తల్లిదండ్రులు తమ ఐదుసంవత్సరాల లోపు చిన్నారులకు భోజనం చేస్తున్న సమయంలో ఏడవకుండా మొబైల్ ఫోన్లను అత్యధికంగా ఇవ్వడమే ప్రధాన కారణంగా తెలియజేశారు. తర్వాత 6 నుండి 15 సంవత్సరాలలోపు విద్యార్థులు ఆటపాటల్లో కాకుండా ఫోన్లతో కాలక్షేపం చేయడం, వాటిలో క్రీడలు తదితర విషయాలను అధికంగా చూడడం ప్రధాన కారణంగా తెలియజేశారు. ఫోన్ లను, టీవీలను పిల్లలు అధికంగా చూడడం వలన కంటిలోని రెటీనా క్షీణించి, కంటి నరాలు పాడయిపోయి శాశ్వతంగా చూపు కోల్పోతుందని తెలిపారు. బంగారు భవిష్యత్తు గల ఇలాంటి పిల్లలు తమ అంధ పాఠశాలలో చేరడం బాధ కలిగిస్తుందని తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాలు పిల్లలకు తెలియజేయాల్సిన తల్లిదండ్రులు సైతం మొబైల్ ఫోన్లతో గడపడం బాధాకరమని అన్నారు. దయచేసి తల్లిదండ్రులు తమ పిల్లలకు మొబైల్ ఫోన్ల నుంచి దూరంగా ఉంచాలని, వారితో స్నేహం చేస్తూ ఫోన్, టీవీ తదితర వాటిని అధికంగా చూడడం వలన జరుగు నష్టాలను చెప్పాలని, తద్వారా మన అందమైన కళ్ళను కాపాడుకోవచ్చని, కళ్ళు లేనిదే ఈ అందమైన సృష్టిని మనం వీక్షించలేమని, తమ తల్లిదండ్రులను సైతం కళ్ళతో చూడలేరని తమ తమ పిల్లలకు విడమరిచి చెప్పాలని అన్నారు. భగవంతుడు కల్పించిన చూపును కాపాడుకోవాలన్నారు. మొబైల్ ఫోన్ లను అత్యధికంగా వాడడం వల్ల రేడియేషన్ తో మెదడులోని నరాలు క్షీణించి, మెదడు మొద్దు బారిపోయి అనేకమంది మానసిక రుగ్మతలకు గురవుతున్నారని వారు తెలియజేశారు. తమ పాఠశాలకు విజ్ డమ్ విద్యార్థులు 1 లక్ష 13 వేలవిరాళాన్ని సేకరించి అందించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పాఠశాల విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు, సేవా గుణం లో సైతం ముందు ఉండడం గర్హనీయమని వారు తెలియజేశారు. ప్రతీ సంవత్సరం మా అంధ పాఠశాలకు విరాళాలు అందిస్తూ మీలాంటి వారికి మేమున్నామనే భరోసాను కల్పించడం ఆనందంగా ఉందని వారు తెలిపారు. ఆ భగవంతుడు పిల్లలకి, జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, బంగారు భవిష్యత్తునిస్తున్న ఉపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి ఎల్లవేళలా ఆయురారోగ్యాలు కల్పించాలని ఇట్రాడో పాఠశాల విద్యార్థులు కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ జావేద్, కరస్పాండెంట్ జహంగీర్, అకాడమిక్ ఇంచార్జి నాజియా ఇక్బాల్, వైస్ ప్రిన్సిపాల్ ప్రకాష్, ప్రీ స్కూల్ ప్రిన్సిపాల్ ఫహీం సుల్తాన, వీరభద్రయ్య, హారిక, ప్రశాంత్ కుమార్, రియాజ్, రాజేష్, పృద్వి, అరుణ, యాస్మిన్ లతోపాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు,విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :