Thursday, 30 July 2026 12:15:12 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ఘనంగా మహా మండల పడి పూజ...

శరణు ఘోషతో పోరెత్తిన అభినవ శబరిమల...! పూజకు హాజరైన మంత్రి అడ్డూరి లక్ష్మణ్

Date : 27 December 2025 08:48 PM Views : 193

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : అభినవ శబరిమలిగా ప్రసిద్ధిగాంచిన దండేపల్లి మండలం గూడెం అయ్యప్ప స్వామి దేవాలయంలో శనివారం గురుస్వామి శ్రీశ్రీశ్రీ చక్రవర్తుల పురుషోత్తమాచార్య ఆధ్వర్యంలో మహా మండలపూజను ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణ్ హాజరై తమ మొక్కలు చెల్లించుకున్నారు. ప్రతి ఏట గూడెం అభినవ శబరిమలలో వేలాదిమంది స్వాములు దీక్షలు తీసుకోవడంతో పాటు ఇక్కడే మాలలు కూడా విరమణ చేస్తుంటారు. వచ్చిన స్వాములందరికీ మకరజ్యోతి దర్శనం, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. కార్తీక మాసం పురస్కరించుకొని మకర సంక్రాంతి వరకు ఈ ఆలయంలో గురుస్వామి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి కాకుండా కరీంనగర్, వరంగల్, మహారాష్ట్ర లోని పలు జిల్లాల నుండి కూడా వందలాది మంది భక్తులు తరలివచ్చి ఇక్కడే మాల వేసుకుని మాల విరమణ కూడా చేస్తారు. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. మకర సంక్రాంతి పర్వదినాన ఇదే ప్రాంతంలో మకరజ్యోతి దర్శనాన్ని కూడా ఏర్పాటు చేస్తారు. అంతేకాకుండా ఈ ఆలయంలో సమీపాన్ని సత్యదేవుని ఆలయంతో పాటు సాయిబాబా ఆలయాలు కూడా ఉండడంతో ప్రత్యేకత సంతరించుకుంది. వచ్చిన భక్తులు స్వాములంతా ముందుగ ఆలయాల సమీపంలో గల పుణ్య గోదావరిలో స్నానాలు ఆచరించి వారి యొక్క మొక్కులు చెల్లించుకుంటారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: