Wednesday, 17 June 2026 01:36:14 PM
# ఆదివాసి మహిళలను చెప్పులతో కొట్టిన ఫారెస్ట్ అధికారులును వెంటనే సస్పెండ్ చేయాలి... # జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలి.. # రైతు వేదికల్లో విత్తనాలు, ఎరువుల పంపిణీ .. ! కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి.. # మంచిర్యాలలో ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులపై ఆర్టీఏ కొరడా.. 5 బస్సులు సీజ్ # వృద్ధాప్యంలో కొండంత అండ: రూ. 30 లక్షల ప్రమాద బీమా, రూ. 10 లక్షల సహజ మరణ బీమా కల్పించడం పట్ల సర్వత్రా హర్షం... # తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలికి ఘన స్వాగతం.. # ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలి.. # ఎమ్మెల్యే పై కవిత అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. # అంగన్‌వాడీలే చిన్నారుల భవిష్యత్తుకు బలమైన పునాదులు. మంత్రి సీతక్క.. # రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే.. # ఇందిరమ్మ ఇళ్లకు 77 లక్షల దరఖాస్తులు.. స్థలం లేనివారికీ మంజూరు.. # పేదింటి ప్రజల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయం # పేద ప్రజలకు న్యాయం చేసే వరకు పోరాడుతా # ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన కవిత # సింగరేణి సంస్థ సర్వతోముఖాభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం… # ఉప ముఖ్యమంత్రిబట్టి విక్రమార్క ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే... # మునీర్ భాయ్ పుస్తకావిష్కరణ లో పాల్గొన్న మంత్రి వివేక్ # అమావాస్య రోజు మోగనున్న బడిగంటలు.. # ప్రజల మధ్యలో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ # కార్మిక సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..! బిజెపి, బి ఆర్ ఎస్ కుట్రలను సాగనివ్వం...

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పిల్లల భద్రతే ఆపరేషన్ స్మైల్ లక్ష్యం

Date : 03 February 2026 12:48 AM Views : 107

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : బాల కార్మిక వ్యవస్థనునిర్మూలించేందుకు ప్రతి సంవత్సరం రెండు సార్లు ఆపరేషన్ స్మైల్ మరియు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాల ద్వారా తప్పిపోయిన, వదిలివేయబడిన, అలాగే కిరాణా దుకాణాలు, మెకానిక్ షాపులు, హోటళ్ళు, వివిధ కంపెనీలు మరియు రోడ్లపై భిక్షాటన చేస్తున్న బాలలను గుర్తించి, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం లేదా అవసరమైతే చిల్డ్రన్ హోమ్‌లకు పంపించడం జరుగుతుం దన్నారు. దీనిలో భాగంగా రామగుండము పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఆపరేషన్ స్మైల్–XII కార్యక్రమాన్ని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీస్ అధికారులు, సిబ్బంది, అలాగే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ తదితర ప్రభుత్వ శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించామని రామగుండము పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రామగుండము కమీషనరేట్ పరిధిలో ప్రతి డివిజన్‌కు ఒక ఎస్‌.ఐ మరియు నలుగురు సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలను గుర్తించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు.ఈ సంవత్సరం జనవరి 1 నుండి 31 వరకు కమీషనరేట్ వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్–XII కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగా, మొత్తం (166) మంది బాల బాలికలనుగుర్తించినట్లువెల్లడించారు. పెద్దపల్లి జిల్లా పరిధిలో బాలురు – 30, బాలికలు – 18, మొత్తం 48 మందిని గుర్తించి, 05 కేసులు నమోదు చేసి 05 మందిని అరెస్ట్ చేయడం జరిగిం దన్నారు. మంచిర్యాల జిల్లా పరిధిలో* బాలురు 93, బాలికలు 25, మొత్తం 118 మందిని గుర్తించి, 15 కేసులు నమోదు చేసి 15 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ, బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు. బాలల హక్కులను పరిరక్షించేందుకు ఆపరేషన్ స్మైల్ మరియు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలిపారు.ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్నట్లు గానీ, బాల కార్మికులుగా పనిచేస్తున్నట్లు గానీ, లేదా తప్పిపోయిన, వదిలివేయబడిన బాలల సమాచారం తెలిసిన వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 (చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్) లేదా డయల్ 100కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. బాలకార్మికులను నియమించిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆపరేషన్ స్మైల్‌ను విజయవంతం చేయడంలో పోలీస్ శాఖతో కలిసి కృషి చేసిన వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని సీపీ గ అభినందించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: