ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : తిరుమల తిరు పతి దేవస్థానంలో అఖండ నామ సంకీర్తన భజన ప్రోగ్రాంలో కాటారం భక్తాంజనేయ భజన బృందం శుక్రవారం పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఆ వెంకటేశ్వర్లు ఆశీస్సులతో అఖండ నామ సంకీర్తనలు ఆలపించడం జరుగుతుందని భజన బృందం తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్, మద్ది నవీన్ కుమార్, బొల్లం సతీష్, బీరెల్లి అంజయ్య, జి.సదానందం, జి.సంతోష్, ఇప్ప శశిదేవి, చిలువేరు పేష్ చంద్రశేఖర్, శ్రావణ్, జాంబోజు రాజుతో పాటు భక్తులు పాల్గొన్నారు.
Admin
E Nivas News