Thursday, 30 July 2026 08:21:56 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

బస్సుల కొరత పేరిట ప్రయాణికుల పై మోపుతున్న అదనపు భారంపై చర్యలు తీసుకోవాలి

డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెెంకల సురేష్

Date : 23 February 2026 07:34 PM Views : 125

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : కరీంనగర్ వైపు వెళుతున్న మంథని డిపో బస్సులు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నియమ నిబంధనలను పాటించకుండా డిపో అధికారులు ఇష్టమైన రీతిలో బస్సులను సంబంధిత రూట్లకు పంపిస్తున్నారని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు గొర్రెెంకల సురేష్ ఒక ప్రకటనలో ఆరోపించారు. సోమవారం మంథని నుండి కరీంనగర్ వెళ్తున్న TS22 T 7244 పల్లె వెలుగు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుల వద్ద ఎక్స్ ప్రెస్ చార్జీలు వసూలు చేసి ప్రయాణికులను కొంత ఆశ్చర్యానికి గురి చేశారు. ఇదేంటని ప్రశ్నించిన కొందరు ప్రయాణికులకు బస్సు ఎక్కేముందే ఎక్స్ ప్రెస్ అని చెప్పాము కదా అని ఆ బస్సు కండక్టర్ సమాధానం చెప్పసాగారు. మంథని డిపో నుండి గత కొద్ది రోజులుగా పల్ల వెలుగు ఆర్డినరి బస్సులను వేసి ఎక్స్ ప్రెస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారని గతంలో కొన్ని పత్రిక ప్రకటనలు వచ్చినప్పటికీని మంథని డిపో యాజమాన్యం తీరు మారడం లేదన్నారు. పల్లె వెలుగు బస్సులు వేసి ఎక్స్ ప్రెస్ చార్జీలు వసూలు చేస్తు పేద, మధ్య తరగతి ప్రయాణికుల జేబులను కొల్లగొడుతున్న మంథని బస్సు డిపో మేనేజర్ పై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకొని ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: