ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో టూ టౌన్ ఎస్ ఐగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ భార్య దివ్య మంగళవారం ఉదయం పదిగంటల సమయంలో విషం తీసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భార్య భర్తల మధ్య నెలకొన్న కలహాలే దివ్య ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. దివ్య ఆత్మహత్యకు కొద్ది సమయం ముందు భార్య భర్తల మధ్య వాగ్వాదం, ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. దివ్య ఆత్మహత్యకు చంద్రశేఖరే కారణమంటూ బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Admin
E Nivas News