ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీర గోవింద నాయక్ సోమవారం సాయంత్రం మృతి చెందారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ తన స్వగ్రామమైన దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామంలో సొంత గృహంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఖానాపూర్ ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గ అభివృద్ధికి చాలా కృషి చేశారు. అనంతరం కెసిఆర్ తో కలిసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మాజీ ఎమ్మెల్యే మృతి చెంది మృతి చెందడం పట్ల పలువురు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు.
Admin
E Nivas News