ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : అభిమానుల ఆలోచనలు, సూచనలను గౌరవిస్తూ తాను ఏ పార్టీలో చేరాలనేది నిర్ణయం తీసుకుంటానని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ను వీడిన అనంతరం జగిత్యాలలో తొలిసారిగా శుక్రవారం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై జీవన్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రాణహిత నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకోకపోవడం పునరుద్ధరణ పనులు చేపట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే ప్రజల్లో మార్పు కావాలనే భావన రావడం ఆందోళనకరమని పేర్కొన్నారు. అలాగే భాజపా, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు తనపై చూపిస్తున్న అభిమానానికి జీవన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. తన రాజకీయ భవిష్యత్తు నిర్ణయం అభిమానుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని తీసుకుంటానని స్పష్టం చేశారు.
Admin
E Nivas News