ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ తల్లి క్షోభించేలాఅమరులను అవమానించేలా బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు చేశారని, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో అజ్ఞానంతో వ్యవహరిస్తుందని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ "వీర్లపల్లి శంకర్" మండిపడ్డారు. శనివారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ మాట్లాడారు.‘తెలంగాణ ఏర్పాటును అవహేళన చేస్తూ మాట్లాడితే తేజస్వి’ని బిజెపి తోటి ఎంపీలు మౌనంగా ఉంటూ ఏమనకపోవడం అనుమానాలకు తావిస్తుందని అన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచేలా తేజస్వి మాట్లాడుతుంటే బీజేపీ రాష్ట్ర ఎంపీలు, కేంద్ర మంత్రులు చూస్తూ కూర్చోవడం దౌర్భాగ్యమని మండిపడ్డారు. అజ్ఞానులు, ధనబలం, మందబలంతో లోక్‌సభకు వచ్చిన బీజేపీ ఎంపీలకు వారి పార్టీ అయినా బుద్ధి నేర్పించాలని వ్యాఖ్యానించారు. తేజస్వి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలంటూ ఎమ్మెల్యే శంకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పాటును భారత్-పాక్ విభజనతో పోల్చుతూ వ్యాఖ్యలు చేసిన తేజస్విపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇక బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు ఆయన అజ్ఞానానికి పరాకాష్ఠ అని మండిపడ్డారు. గతంలో ప్రధాని మోదీ తల్లిని చంపి బిడ్డను వేరు చేశారంటూ మాట్లాడారనిఆ విద్వేష భావజాలమే ఇప్పుడు తేజస్వి మాటల్లో ప్రతిబింబిస్తోందని విమర్శించారు. తేజస్వి వ్యాఖ్యలు హేయమని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని పేర్కొన్నారు. వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Admin
E Nivas News