ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ళ శ్రీపాద రావు నుంచి నేటి ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు వరకు కాంగ్రెస్ పార్టీకి సుమారు 45 ఏండ్లు సేవలందిస్తూ తన జీవితాన్నే కాంగ్రెస్ పార్టీకి అంకితం చేసిన గోటికార్ కిషన్ జీకి పురపాలక ఎన్నికల్లో స్థానం కల్పించాలని బిసీ వర్గాల నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కీర్తిశేషులు దుద్దిళ్ళ శ్రీపాద రావు కు ముఖ్య అనుచరుడైన బిసీ నాయకుడు గోటికార్ కిషన్ జీ ప్రస్తుత ఐటి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు వరకు కష్ట కాలంలో సైతం కాంగ్రెస్ పార్టీ ఎనలేని సేవలందించాడు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున సమయంలొ ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు దేశం, తెలంగాణ రాష్టృ ఏర్పడిన తరువాత టిఆర్ఎస్ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు అండగా నిలబడాలి కాంగ్రెస్ బలోపేతానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. బిసీ నాయకునిగా ఉంటూ బిసీల ఓట్లు చీలకుండ శ్రీధర్ బాబు విజయంలో దశాబ్దాలుగా కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించిన నాటి నుండి నేటి వరకు కిషన్ జీ ఏలాంటి ఉన్నత పదవులు పొందలేదు. సుమారు 70 ఏండ్ల వయసులో ఇప్పటి వరకు ప్రజా ప్రతినిధిగా పోటీ చేసే అవకాశం పార్టీ కల్పించలేదు. పురపాలక ఎన్నికల్లో మంథని ఛైర్మన్ స్థానం బిసీ జనరల్ కావడంతో కౌన్సిలర్ గా పోటీ చేయాలని తన వర్గీయులు కిషన్ జీ ని తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ఈసారైనా శ్రీధర్ బాబు దృష్టి కిషన్ జీ పై పడుతుందా అని పార్టీలో పలువురు సీనియర్ నాయకులు చర్చించుకుంటున్నారు. ఈ సారి కచ్చితంగా కౌన్సిలర్ (ప్రజా ప్రతినిధి)గా పోటీ చేసే అవకాశం గోటికార్ కిషన్ జీ కి కల్పించాల్సిందేనని పలువురు కార్యకర్తలు తేల్చి చెపుతున్నారు. ఏది ఏమైనప్పటికీ మంత్రి విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాత ఏలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.. *అధిష్టానం ఆదేశిస్తే బరిలో ఉంటా* ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశిస్తే బరిలో ఉండి బిసీ లేదా జనరల్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గా పోటీ చేస్తానని కిషన్ జీ "ఇ నివాస్ డిజిటల్ న్యూస్ తో "తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Admin
E Nivas News