ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్ కోరారు. బుధవారం లక్షెట్టిపేట మున్సిపాలిటీలోని ఏడవ వార్డుకు చెందిన సుమారు 30 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఏడవ వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా బిజిలి ఉప్పలయ్యను ప్రకటించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కళ్లిబొల్లి మాటలతో ప్రజలను కాంగ్రెస్ మభ్యపెట్టాలని చూస్తుందన్నారు. లక్షెట్టిపేట పట్టణం అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ గెలుపు అవసరమని పేర్కొన్నారు. పట్టణ వాసులు బీఆర్ఎస్ ను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య, మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, మాజీ వార్డు కౌన్సిలర్ మెట్టు రాజు కళ్యాణి, మాజీ వార్డ్ మెంబర్ జిన్ని వెంకటేష్, పొన్నం శ్రీనివాస్ గౌడ్, మైనార్టీ నాయకులు షేక్ చాంద్, నాయకులు గడి కొప్పుల సతీష్,ఏడో వార్డు అధ్యక్షులు నల్ల శంకర్రావు తదితరులు పాల్గొన్నారు .
Admin
E Nivas News