Friday, 31 July 2026 03:54:26 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఖానాపూర్ డబల్ బెడ్ రూమ్ లో పూర్తిస్థాయిలో సమగ్రంగా విచారణ జరిపించి అనరులను తొలగించాలని కలెక్టర్ కు వినతి

Date : 24 November 2025 09:17 PM Views : 238

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో కొమరం భీమ్ చౌరస్తాలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ లలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కేటాయించిన ఇండ్లలో అనర్హులను తొలగించి, అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూములు ఇవ్వాలని సిపిఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ, ఎంసీపీఐ(యు), డబుల్ బెడ్ రూమ్ సాధన కమిటీ ఆధ్వర్యంలో ప్రజావాణిలోనిర్మల్ జిల్లా కలెక్టర్ కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం.ఎల్) న్యూ డెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునరికారి రాజేష్, ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి అల్లెపు పీటర్ లు మాట్లాడుతూ ఖానాపూర్ డబల్ బెడ్రూములలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇండ్లను కేటాయించారని గత కొన్ని నెలల నుండి అధికారుల దృష్టికి రాతపూర్వకంగా తీసుకువచ్చినప్పటికీ ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్న చందంగా నామమాత్రంగా సర్వే చేసి కొంత లిస్టు పెట్టి చేతులు దులుపుకున్నారు తప్ప శాశ్వత పరిష్కారం చూయించలేదు. మిగతా వాటిలో విచారణ జరపడంలో జాప్యం జరుగుతుందని, ఎప్పుడు పూర్తిస్థాయి లో విచారణ చేస్తారో ఇంకెంతకాలం గడుపుతారో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అర్హులైన పేదల కోసం కేటాయించిన ఇండ్లను వారికి చెందకుండా ఇతరులకు కేటాయించడం ఎంతవరకు సమంజసం. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు స్పందించి సర్వేల పేరుతో కాలయాపన చేయకుండా తొందరనే పరిష్కారం చేసి నిరుపేదలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడు దుర్గం లింగన్న, తోటరాద, కమల, గౌస్, షాదుల్లా, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :