Saturday, 01 August 2026 08:34:12 AM
# పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన నిత్య సమాజ సేవకుడు & రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆకుల సలాం # బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత... # ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారికి ఆత్మీయ వీడ్కోలు # చోరీ కేసు లో ఇంటి పనివాడే దొంగగా మారాడు.. # బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనంపై నిషేధాజ్ఞల కొనసాగింపు..! అనుమతి లేని డ్రోన్లు, డీజే సౌండ్ సిస్టమ్‌లపై కఠిన చర్యలు.. # జిల్లా జైలులో సెక్యూరిటీ రివ్యూ నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. # దొంగతనం కేసులో శంకర్ లాల్ కు సహకరించిన మహిళ అరెస్టు... # పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి... # అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ల పోస్టర్ విడుదల... # ఆగస్టు-3 నుండి పాములపాడు గ్రామంలో భూముల రీ సర్వే ప్రారంభం # రెవెన్యూ రికార్డుల్లో అవకతవకలు - ఏడాదిగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా న్యాయం దక్కలేదు–రైతు కురువ ఎల్లయ్య ఆవేదన # మంత్రి టీజీ.భరత్, మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ.వెంకటేష్ లను ఘనంగా సన్మానం చేసిన లీగల్ సెల్ జి.నాగముని, జగదీష్, దాశెట్టి శ్రీనివాసులు, చంద్రుడు # నందికొట్కూరు పట్టణంలోని, 16వ వార్డులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం...

దొంగతనం కేసులో శంకర్ లాల్ కు సహకరించిన మహిళ అరెస్టు...

Date : 31 July 2026 10:08 PM Views : 20

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టిం చిన దొంగతనం కేసు ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కరీంనగర్ రూరల్ పోలీసులు ఇప్పటికే ప్రధాన నిందితుడైన పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్పూర్ గ్రామానికి చెందిన జడ్పీటీసీ భర్త తగరం శంకర్ లాల్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌ కు తరలించిన విష యం పాఠకులకు తెలిసిందే. ఈ క్రమంలో, గురువారం మధ్యా హ్నం మరో ట్విస్టు చోటుచేసుకుంది. సుమారు 3.30 గంటల సమయంలో, కరీంనగర్ రూరల్ సీఐ ఏ. నిరంజన్ రెడ్డి కి అందిన విశ్వసనీ య సమాచారం మేరకు, ఆయన తన సిబ్బందితో కలిసి తీగలగుట్టపల్లి రైల్వే రైల్వే స్టేషన్ కు వెళ్లి అను మానాస్పదంగా సంచరిస్తున్న ఓ మహిళను అదుపు లోకి తీసుకుని విచారించారు. విచారణలో ఆమె తన పేరు ఆడెపు రేష్మా, కేశవపట్నం మండలం చింతగుట్ట పల్లి గ్రామానికి చెందినదని, అలాగే ఈ కేసులో మొదటి నిందితుడైన తగరం శంకర్‌కు సన్నిహితు రాలినని తెలిపింది. నిన్న తగరం శంకర్‌ ను కరీంనగర్ రూరల్ పోలీసులు అరెస్ట్ చెయ్యగా శంకర్ లాల్ ను రిమాండ్‌కు తరలిం చిన విషయం పత్రిక ల్లో , టీవీ వార్తల ద్వారా తెలుసుకొని, తనను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో బంధువుల ఇంటికి వెళ్లేందుకు చంద్రా పూర్‌కు వెళ్లే రైలు కోసం తీగల గుట్టపల్లి రైల్వే స్టేషన్‌ లో వేచి ఉండగా పోలీసులు పట్టుకున్నారని తెలిపింది. తదుపరి విచారణ లో దొంగతనం జరిగిన రోజున తాను కూడా తగరం శంకర్ కలిసి తీగలగుట్టపల్లి లోని ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ ఇంటిలోకి ప్రవేశించి, ఇంటి తాళాలు పగులగొట్టి, అనంతరం బాత్రూమ్ తాళం కూడా పగుల గొట్టి, అక్కడ ప్లాస్టిక్ నీళ్ల ఖాళీ డ్రమ్ములో దాచిపెట్టిన సుమారు రూ.26 లక్షల నగదు ను అపహరించినట్లు అంగీకరించింది. దొంగిలించిన డబ్బు లో తనకు కూడా కొంత వాటా ఇస్తానని తగరం శంకర్ చెప్పి నప్పటికీ, అనంతరం అతడు తన స్వగ్రా మానికి వెళ్లిపోయా డని, డబ్బు పంపిస్తా నని చెప్పి పంపలేద ని, తాను ఎదురు చూస్తుండగా అతడి ని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపింది. తగరం శంకర్‌తో తాను నిరంతరం మాట్లాడేందుకు ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను కూడా పంచుల సమక్షంలో స్వచ్ఛం దంగా చూపించి అప్పగించింది. తన ప్రమేయాన్ని పూర్తిగా అంగీకరించడంతో, పంచనామా నిర్వ హించి, నిందితురా లిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించి, రిమాండ్ నిమిత్తం గురువారం న్యాయ స్థానం ఎదుట హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపా రు. ఈ కేసులో మిగిలిన అంశాలపై దర్యాప్తు కొనసాగు తున్నదని కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఏ. నిరంజన్ రెడ్డి తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :