ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : ఆత్మకూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ కార్యాలయం దగ్గర 77 వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా సీఈఓ నాగేశ్వరరావు తో కలిసి సింగిల్ విండో చైర్మన్ ఏ.షహాబుద్దీన్ జాతీయ జెండాను ఆవిష్కరణ చేసి, వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సింగల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్ మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసం కుల మతాలకతీతంగా బ్రిటిష్ వారిపై వీరోచితంగా పోరాడిన సమరయోధుల గురించి తెలియజేయడం జరిగింది. మనమందరం కూడా వారి అడుగుజాడలలో నడిచి, వారి ఆశయ సాధనాల కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, రమేష్ బాబు, టిడిపి నాయకులు సి.కలిముల్లా, బి.ముర్తుజా, అలీ హుసేన్, జలీల్, మహబూబ్ బాషా, నాగేశ్వర నాయక్, గోపి, బి.షాబుద్దీన్, శ్రీను, సిబ్బంది శివకుమార్, సురేంద్ర కుమార్, రియాజ్, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News