ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / జూపాడుబంగ్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ సంస్థ, చైల్డ్ ఫండ్ ఇండియా ప్రతినిధి టి.షాజహాన్ బేగం ఆద్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినం-2025 సందర్బంగా జూపాడుబంగ్లా మండలంలోని, మండ్లెం గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఆశలు, సిహెచ్ఓ లు, ఏఎన్ఎం లు సిబ్బంది,మరియు మహిళలు ర్యాలీగా వెళ్లి, కేజీ రోడ్డుపై మానవహారం ఏర్పాటు చేసి హెచ్ఐవి పేషెంట్లకు మనోధైర్యాన్నిస్తూ, హెచ్ఐవి రాకుండా ప్రతి ఒక్కరూ పాటుపడతామని, కొత్త ఇన్ఫెక్షన్ రాకుండా, హెచ్ఐవి తో మరణించకూడదు, హెచ్ఐవి రహిత జిల్లాను ఏర్పాటు చేస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఆనంద రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా వ్యాపించదు, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ వ్యాధిగ్రస్థుల పట్ల వివక్షత, చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజంలో కలిసి జీవించాలనేది, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ - క్షయ వ్యాధి సంబంధం గూర్చి, సుఖ వ్యాధులు మరియు చికిత్స గూరించి, కండోమ్ యొక్క ఉపయోగము గూర్చి, హెచ్‌ఐవి/ఎయిడ్స్ యాక్టు-2017 పై అవగాహన కల్పించారు. చెడు అలవాట్లకు బానిస కారాదని హెచ్చరించడం జరిగింది. బాగా చదువుకుంటే ఉన్నత శిఖరాలకు ప్రతి ఒక్క విద్యార్థి ఎదుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ చిన్న నరసయ్య, సరోజిని, నరేష్, అస్మా ఖాతున్, గురుసత్య సాయి టీచర్లు లీలాకుమారి, రాజారావు, గీతా మెడికల్ సిబ్బంది, విజయమ్మ, నాగలక్ష్మి, ఆశ వర్కర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News