ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామానికి చెందిన జలగాని నాగార్జున రెడ్డి ప్రమాదవశాత్తు మరణించిన విషయం తెలుసుకుని, మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ వారి నివాసానికి వెళ్లి పార్థివ దేహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, 5,000/- రూపాయల ఆర్థిక సహాయం అందించారు. నాగార్జున రెడ్డి మృతి గ్రామానికి తీరని లోటని పేర్కొంటూ, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. విషయం తెలుసుకొని సింగపూర్ నుంచి వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత & అంతర్జాతీయ సమాజ సేవకుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరావు కూడా ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బోనపల్లె సత్యరాజు, బూత్ కన్వీనర్ బోనపల్లె వినయ్ కుమార్, బొమ్మ రాజేశ్, చెంచాని వేమారెడ్డి, రమేష్ రెడ్డి, సిరిపిరెడ్డి వేమా రెడ్డి, నారాయణ రెడ్డి, చిన్నస్వామి ఆచారి, సుబ్బారావు, రత్నాకర్, జీవన్న, చిన్న సుబ్బయ్య, మొగిలి శ్రీను, శేషి రెడ్డి, సురేష్, మురహరి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News