ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / వెలుగోడు : ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన ఆత్మకూరు మండలంలోని, ఎస్.ఎన్. తాండా గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త వేముల మనేష్ కుటుంబానికి అండగా ఉంటామని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి అన్నారు. శనివారం వెలుగోడు మండలంలోని, వేల్పనూరు గ్రామం నందు మునేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ల సహకారంతో మంజూరైన రూ.5 లక్షల భీమా సొమ్మును భార్య వేముల రోజా కు అందజేశారు. కార్యకర్తల మరణం పార్టీకి తీరనిలోటు, వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటానని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా ప్రతినిధి కె.శివకుమార్, తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.
Admin
E Nivas News